ముల్లంగి చట్నీ

ABN , First Publish Date - 2017-12-10T00:14:18+05:30 IST

ముల్లంగి తురుము - ఒక కప్పు, టమోటా - ఒకటి, అల్లం - అంగుళం ముక్క, చింతపండు - నిమ్మకాయంత, ఇంగువ...

ముల్లంగి చట్నీ

కావలసిన పదార్థాలు
ముల్లంగి తురుము - ఒక కప్పు, టమోటా - ఒకటి, అల్లం - అంగుళం ముక్క, చింతపండు - నిమ్మకాయంత, ఇంగువ - పావు టీ స్పూను, నువ్వుల నూనె - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, తాలింపు కోసం : నూనె, ఆవాలు, మినప్పప్పు, కొత్తిమీర, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ - సరిపడా.
 
తయారుచేసే విధానం
నూనెలో తాలింపు దినుసులు వేగించి తీసి చల్లారనివ్వాలి. అదే పాన్‌లో మరికొద్ది నూనె వేసి ముల్లంగి తురుము, టమోటా, అల్లం, చింతపండు వేసి మూతపెట్టి మగ్గించాలి. తర్వాత అన్నీ కలిపి ఉప్పుతో పాటు రుబ్బుకోవాలి. చివర్లో
కొత్తిమీరతో అలంకరించాలి.

Updated Date - 2017-12-10T00:14:18+05:30 IST