ప్రాన్‌ సూప్‌

ABN , First Publish Date - 2017-07-22T23:03:09+05:30 IST

కావలసిన పదార్థాలు నువ్వుల నూనె - 5 టీ స్పూన్లు, ఉల్లి ముక్కలు - 1 కప్పు రెడ్‌ పెప్పర్‌ - 2 (విత్తనాలు తీసి సన్నగా తరగాలి)

ప్రాన్‌ సూప్‌

కావలసిన పదార్థాలు
 
నువ్వుల నూనె - 5 టీ స్పూన్లు, ఉల్లి ముక్కలు - 1 కప్పు
రెడ్‌ పెప్పర్‌ - 2 (విత్తనాలు తీసి సన్నగా తరగాలి)
వెల్లుల్లి తరుగు - 1 టీ స్పూను, ఆవాలు - చిటికెడు
మిరియాల పొడి - 1 టీ స్పూను, కారం - 3 టీ స్పూన్లు, మైదా - 4 టీ స్పూన్లు
ఫిష్‌ స్టాక్‌ - 400 మి.లీ, బిరియానీ ఆకులు - 2
రొయ్యలు - 400 గ్రాములు, ఉప్పు - తగినంత
 
తయారీ విధానం
 
పాన్‌లో నూనె వేడి చేసి ఉల్లి ముక్కలు, వెల్లుల్లి, రెడ్‌ పెప్పర్‌ వేసి వేయించాలి.
ఆవాలు, కారం వేసి కలపాలి. చిన్న మంట మీద 3 నిమిషాలపాటు కలుపుతూ ఉడికించాలి.
ఫిస్‌ స్టాక్‌ పోస్తూ, బాగా కలిసేలా తిప్పాలి.
బిరియానీ ఆకు వేసి మరిగించాలి.
5 నిమిషాలపాటు చిన్న మంట మీద ఉంచి సూప్‌ చిక్కబడేవరకూ కలపాలి.
రొయ్యలు వేసి అవి ముడుచుకునే వరకూ 5 నిమిషాలపాటు ఉడికించాలి.
చివర్లో ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి దింపేయాలి.

Updated Date - 2017-07-22T23:03:09+05:30 IST