టమాటా సూప్‌

ABN , First Publish Date - 2017-07-22T23:06:17+05:30 IST

కావలసిన పదార్థాలు పెద్ద టమాటాలు - 4, వెల్లుల్లి - 4 (సన్నగా తరగాలి) ఉల్లి తరుగు - అర కప్పు, బిరియానీ ఆకు - 1

టమాటా సూప్‌

కావలసిన పదార్థాలు
 
పెద్ద టమాటాలు - 4, వెల్లుల్లి - 4 (సన్నగా తరగాలి)
ఉల్లి తరుగు - అర కప్పు, బిరియానీ ఆకు - 1
కార్న్‌ స్టార్చ్‌ + 2 టేబుల్‌ స్పూన్ల నీళ్లు, ఒకటిన్నర టీస్పూను - వెన్న
క్రీమ్‌ - 1 టేబుల్‌ స్పూను, పంచదార - అర టేబుల్‌ స్పూను
బ్రెడ్‌ - 2 స్లయుసులు, మిరియాల పొడి, ఉప్పు - తగినంత
 
తయారీ విధానం
 
టమాటాలు బాగా కడిగి గిన్నెలో టమాటాలు మునిగేంతటి నీళ్లు పోసి మరిగించాలి.
ఆ నీళ్లలో 1 టీస్పూను ఉప్పు వేయాలి.
నీళ్లు మరిగాక టమాటాలు వేసి మంట తీసేయాలి.
20 నిమిషాల తర్వాత టమాటాలను తీసి చల్లారనివ్వాలి.
తర్వాత టమాటా లోపలి విత్తనాలు తొలగించి, తొక్కు తీసి బ్లెండర్‌లో వేసి జ్యూస్‌ తయారు చేసి పెట్టుకోవాలి.
పాన్‌ మీద బ్రెడ్‌ను కరకరమనేలా రెండు వైపులా కాల్చుకోవాలి.
తర్వాత క్యూబ్స్‌లా కట్‌ చేసుకోవాలి.
కార్న్‌ఫ్లోర్‌లో 2 టీ స్పూన్ల నీళ్లు పోసి పేస్ట్‌ తయారుచేసుకోవాలి.
పాన్‌లో బటర్‌ వేసి, కరిగాక బిరియానీ ఆకు వేసి వేయించాలి.
వెల్లుల్లి తరుగు కూడా వేసి, వేయించాలి.
తర్వాత ఉల్లిపాయలు వేసి, దోరగా వేగాక టమాటా గుజ్జు వేయాలి.
నీళ్లు చేర్చి కలిపి, ఉప్పు, మిరియాల పొడి కూడా వేయాలి.
చిన్న మంట మీద ఉంచి, సూప్‌ను మరిగించాలి.
కార్న్‌ స్టార్చ్‌ పేస్ట్‌ వేసి కలిపి, చిన్న మంట మీద 4 నిమిషాలు ఉడికించాలి.
పంచదార, క్రీమ్‌ కూడా వేసి కలపాలి.
ఒక నిమిషం తర్వాత పొయ్యి మీద నుంచి దింపాలి.
బౌల్స్‌లో నింపి బ్రెడ్‌ క్యూబ్స్‌ వేసి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2017-07-22T23:06:17+05:30 IST