అరటికాయ దూట పచ్చడి

ABN , First Publish Date - 2017-09-02T22:10:49+05:30 IST

అరటి దూట - పది సెంటీమీటర్ల పొడవుది, అల్లం - అర అంగుళం ముక్క, పచ్చిమిర్చి - 3, పెరుగు - ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము...

అరటికాయ దూట పచ్చడి

కావలసిన పదార్థాలు
 
అరటి దూట - పది సెంటీమీటర్ల పొడవుది, అల్లం - అర అంగుళం ముక్క, పచ్చిమిర్చి - 3, పెరుగు - ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము - ఒక టేబుల్‌ స్పూను, ఆవాలు, మినప్పప్పు, ఇంగువ - అర టీ స్పూను చొప్పున, కరివేపాకు - 4 రెబ్బలు, నూనె - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారుచేసే విధానం
 
నార తీసి శుభ్రం చేసిన దూటని చాలా చిన్న ముక్కలుగా తరిగి (నల్లబడకుండా మజ్జిగలో వేసి) కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత తగినంత నీటిలో ఉప్పు వేసి ఉడికించాలి. ఈలోపు కొబ్బరితురుము, పచ్చిమిర్చి, అల్లం కలిపి రుబ్బుకోవాలి. (వడకట్టి చల్లారిన) దూట ముక్కల్లో అల్లం మిశ్రమం, పెరుగు, ఉప్పు వేసి బాగా కలిపి తాళింపు జతచేయాలి.

Updated Date - 2017-09-02T22:10:49+05:30 IST