తులసి-టొమాటో సూప్‌

ABN , First Publish Date - 2017-04-08T20:34:35+05:30 IST

కావాల్సిన పదార్థాలు ఆకుకూరలు ఆలివ్‌ ఆయిల్‌- 3 టేబుల్‌స్పూన్లు వెల్లులి- 3 (తరిగినవి)

తులసి-టొమాటో సూప్‌

కావాల్సిన పదార్థాలు
 
ఆకుకూరలు
ఆలివ్‌ ఆయిల్‌- 3 టేబుల్‌స్పూన్లు
వెల్లులి- 3 (తరిగినవి)
ఉల్లిపాయలు- 2 (తరిగినవి)
క్యారెట్లు-2 (తరిగినవి)
కొన్ని టొమాటోలు
టొమాటోలు: 2 (సన్నగా తరిగినవి)
కూరగాయలు ఉడికించిన నీరు:ఒకటిన్నర లీటర్లు
ఉప్పు, మిరియాలు : తగినంత
 మసాలాకు:తులసి రెమ్మలు-2
ఆలివ్‌ ఆయిల్‌
నిమ్మ చెక్క
 
 
తయారీ విధానం
 
పాన్‌లో ఆలివ్‌ ఆయిల్‌ని వేడి చేసి అందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యారెట్‌, సన్నగా తరిగిన ఆకుకూరలు వేయాలి. పది నిమిషాలు చిన్న మంటతో స్టవ్‌ మీద ఉంచాలి. తర్వాత దాంట్లో కొన్ని టొమాటోలు, తరిగిన టొమాటో ముక్కలు, కూరగాయల నీళ్లు, రాళ్ల ఉప్పు, మిరియాల పొడి వేయాలి. 10-15 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని ఉడకనివ్వాలి. ఆ తర్వాత పొయ్యి నుంచి దించి చిక్కటి సూప్‌గా చేయాలి. ఈ సూప్‌ పైన తులసి ఆకులు, ఆలివ్‌ ఆయిల్‌, ఉప్పు, మిరియాలపొడి, నిమ్మ రసం వేసి బాగా కలపాలి.

Updated Date - 2017-04-08T20:34:35+05:30 IST