మష్రూమ్స్ మంచూరియా

ABN , First Publish Date - 2017-07-01T19:26:24+05:30 IST

కావలసిన పదార్థాలు మష్రూమ్స్‌ - 200 గ్రా., మిరియాల పొడి - ఒక టీ స్పూను, బియ్యప్పిండి, మైదా, కార్న్‌ఫ్లోర్‌ - 3 టేబుల్‌ స్పూన్ల చొప్పున, ఉప్పు - రుచికి

మష్రూమ్స్ మంచూరియా

కావలసిన పదార్థాలు
 
మష్రూమ్స్‌ - 200 గ్రా., మిరియాల పొడి - ఒక టీ స్పూను, బియ్యప్పిండి, మైదా, కార్న్‌ఫ్లోర్‌ - 3 టేబుల్‌ స్పూన్ల చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, కారం - ఒక టీ స్పూను, నీరు - అరకప్పు, నూనె - వేగించడానికి సరిపడా, ఉల్లిపాయలు - 2, వెల్లుల్లి రెబ్బలు - 4, సోయా సాస్‌ - 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి - 4, టమోటా సాస్‌ - ఒక టేబుల్‌ స్పూను, టమోటా ప్యూరీ - 2 టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తరుగు - అలంకరణకు.
 
తయారుచేసే విధానం
 
ఒక బౌల్‌లో బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్‌, మైదా, కారం, ఉప్పు (ఇష్టమైతే చిటికెడు ఆరంజ్‌ ఫుడ్‌ కలర్‌) వేసి నీటితో జారుగా కలుపుకోవాలి. రెండు ముక్కలుగా తరిగిన మష్రూమ్స్‌ను జారులో ముంచి నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. ఇప్పుడు మరో కడాయిలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి ఉల్లి తరుగు, పొడుగ్గా చీరిన పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు చిటికెడు ఉప్పు వేసి వేగించాలి. తర్వాత సోయా సాస్‌, టమోటా ప్యూరీ, సాస్‌ (ఇష్టమైతే అజినమోటో చిటికెడు) వేయాలి. రెండు నిమిషాల తర్వాత పక్కనుంచిన మష్రూమ్స్‌ వేసి చిక్కబడేవరకూ ఉంచి కొత్తిమీర చల్లి దించేయాలి. ఇవి స్నాక్స్‌గా లేదా భోజనంతో పాటు సైడ్‌ డిష్‌గా బావుంటాయి.

Updated Date - 2017-07-01T19:26:24+05:30 IST