పొట్లకాయతో పెరుగు పచ్చడి

ABN , First Publish Date - 2017-10-07T23:39:17+05:30 IST

పొట్లకాయ ముక్కలు - ఒక కప్పు, పెరుగు - ఒకటిన్నర కప్పు, పచ్చిమిర్చి తరుగు...

పొట్లకాయతో పెరుగు పచ్చడి

కావలసిన పదార్థాలు
పొట్లకాయ ముక్కలు - ఒక కప్పు, పెరుగు - ఒకటిన్నర కప్పు, పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఎండు మిర్చి - 2, కరివేపాకు - 4 రెబ్బలు, ఇంగువ - చిటికెడు, ఆవాలు - ఒక టీ స్పూను, కొత్తిమీర, పుదీనా తరుగు - అరకప్పు, నూనె - ఒక టేబుల్‌ స్పూను.
 
తయారుచేసే విధానం
ముందుగా పొట్లకాయ ముక్కల్లో చిటికెడు ఉప్పు, పసుపు వేసి ఉడికించి నీరు వడకట్టి పక్కనుంచాలి. ఆవాలకు కొద్ది నీరు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పెరుగులో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా తరుగుతో పాటూ ఉప్పు, ఆవ పేస్టు, ఉడికించిన పొట్లకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. తర్వాత విడిగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువతో పెట్టిన తాళింపును పెరుగులో కలపాలి.

Updated Date - 2017-10-07T23:39:17+05:30 IST