రాగి బాదం లడ్డు

ABN , First Publish Date - 2017-09-23T23:31:51+05:30 IST

రాగిపిండి - ముప్పావు కప్పు, బాదం పొడి (బాదం కొద్దిగా వేగించి మిక్సీలో పొడి చేసుకోవాలి...

రాగి బాదం లడ్డు

కావలసిన పదార్థాలు
 
రాగిపిండి - ముప్పావు కప్పు, బాదం పొడి (బాదం కొద్దిగా వేగించి మిక్సీలో పొడి చేసుకోవాలి) - ఒక కప్పు, యాలకుల పొడి - ఒక టీ స్పూను, పంచదార పొడి - ముప్పావు కప్పు, నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు.
 
తయారుచేసే విధానం
 
నెయ్యిలో రాగిపిండి వేసి మాడకుండా దోరగా వేగించాలి. అదే పిండిలో బాదం పొడి, పంచదార పొడి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. మిశ్రమం వేడి మీద ఉన్నప్పుడే కొంత కొంత తీసుకుని అరచేతుల్తో వత్తుతూ లడ్డూలు చేసుకోవాలి.

Updated Date - 2017-09-23T23:31:51+05:30 IST