బీట్‌రూట్ రసం

ABN , First Publish Date - 2017-02-18T17:17:50+05:30 IST

బీట్‌రూట్‌ తురుము- ఒక కప్పు, పచ్చిమిర్చి- 3, అల్లం- అంగుళం ముక్క, వెల్లుల్లి రెబ్బలు- 5, కంది పప్పు- 1 టేబుల్‌స్పూను, టమోటాలు- 3, చింతపండు రసం- అర కప్పు,

బీట్‌రూట్ రసం

కావలసిన పదార్థాలు: బీట్‌రూట్‌ తురుము- ఒక కప్పు, పచ్చిమిర్చి- 3, అల్లం- అంగుళం ముక్క, వెల్లుల్లి రెబ్బలు- 5, కంది పప్పు- 1 టేబుల్‌స్పూను, టమోటాలు- 3, చింతపండు రసం- అర కప్పు, పసుపు, కారం, రసం పొడి- అర టీస్పూన్‌ చొప్పున, మిరియాలు- అర టీస్పూను, జీలకర్ర- టేబుల్‌ స్పూను, కొత్తిమీర, కరివేపాకు- కొద్దిగా, ఆవాలు- పావు టీ స్పూను, ఇంగువ- చిటికెడు, నూనె- 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం: మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర కలిపి మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్‌లో కందిపప్పు, ఉప్పు, పసుపు, కారం వేసి మూడు విజిల్స్‌ వచ్చేదాకా ఉడికించాలి. తర్వాత బాణలిలో నూనె వేసి వేడెక్కాక ఆవాలు, కరివేపాకు, జీలకర్ర ముద్ద, ఇంగువ వేసి వేగించాలి. ఆ తర్వాత అల్లం తురుము, బీట్‌రూట్‌ తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. తర్వాత కందిపప్పు, టమోటా ముక్కలు, రసం పొడి కూడా వేసి మరో 10 నిమిషాలు ఉడికించాలి. చివరగా చింతపండు రసం పోసి మరో 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దించేయాలి.

Updated Date - 2017-02-18T17:17:50+05:30 IST