పచ్చిమామిడి తీపి పచ్చడి

ABN , First Publish Date - 2016-04-28T19:57:29+05:30 IST

కావలసిన పదార్థాలు: మామిడి కాయ- 1, బెల్లం తురుము- 1/2 కప్పు, ఉప్పు- రుచికి సరిపడా, బియ్యప్పిండి- 1 టీ స్పూను, పసుపు- 1/4 టీ స్పూను, తాలింపు దినుసులు- 1 టీ స్పూను, నూనె- 3 టీ స్పూన్లు

పచ్చిమామిడి తీపి పచ్చడి

కావలసిన పదార్థాలు: మామిడి కాయ- 1, బెల్లం తురుము- 1/2 కప్పు, ఉప్పు- రుచికి సరిపడా, బియ్యప్పిండి- 1 టీ స్పూను, పసుపు- 1/4 టీ స్పూను, తాలింపు దినుసులు- 1 టీ స్పూను, నూనె- 3 టీ స్పూన్లు

తయారీ విధానం:
స్టౌ మీద ఒక బాణలి ఉంచి దానిలో బెల్లం తురుము వేసి అది మునిగే వరకూ నీళ్ళు పోసి ఉడికించాలి. తీగ పాకం వస్తుందనగా దింపేయాలి. తరువాత మామిడికాయను చిన్న ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో వేసి అవి మునిగే వరకూ నీళ్ళు పోసి ఉడికించాలి. ముక్కలు ఉడికాక దానిలో బెల్లం పాకం పోసి మరో ఐదునిమిషాలు ఉడికించాలి. తరువాత బియ్యప్పిండిలో మూడు టీ స్పూన్ల నీళ్ళు పోసి కలిపి దానిని మామిడి ముక్కల మిశ్రమంలో పోసి కలుపుతూ రెండు నిమిషాలు ఉడికించాలి. ఆ తరువాత తాలింపు పెట్టి దింపేయాలి. దీనిని ఫ్రిజ్‌లో ఉంచితే మూడు రోజులు నిలువ ఉంటుంది.

Updated Date - 2016-04-28T19:57:29+05:30 IST