చనా పరోటా

ABN , First Publish Date - 2016-05-24T15:06:41+05:30 IST

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి- ఒకటిన్నర కప్పు, నూనె- 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడా, నానబెట్టిన తెల్ల శెనగలు- 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు- 1/2 కప్పు, పచ్చిమిర్చి- 4, అల్లం తరుగు

చనా పరోటా

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి- ఒకటిన్నర కప్పు, నూనె- 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడా, నానబెట్టిన తెల్ల శెనగలు- 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు- 1/2 కప్పు, పచ్చిమిర్చి- 4, అల్లం తరుగు- 1/4 టీ స్పూను, కొత్తిమీర, కరివేపాకు తరుగు- ఒక్కోటి 1/2 టీ స్పూను చొప్పున, కారం- 1/2 టీ స్పూను, గరంమసాల- 1/2 టీ స్పూను, పసుపు- చిటికెడు.
 
తయారీ విధానం: గోధుమ పిండిలో ఉప్పు, రెండు టీ స్పూన్ల నూనె వేసి, సరిపడా నీళ్ళతో చపాతీ పిండి కలుపుకోవాలి. దానికి నూనె పట్టించి ఒక గంట సేపు నాననివ్వాలి. తరువాత శెనగలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం తరుగులను మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు చిలకరించి బరకగా ముద్ద చేయాలి. తరువాత ఒక కడాయిలో టేబుల్‌ స్పూను నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను దోరగా వేగించుకోవాలి. ఆ తరువాత శెనగల ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకూ వేగించి, కారం, పసుపు, గరం మసాల జల్లి మరో రెండు నిమిషాలు వేగించి దించేయాలి. తరువాత నిమ్మకాయ పరిమాణంలో చపాతీ పిండి తీసుకుని, దాని మధ్యలో ఉసిరికాయంత శెనగల మిశ్రమాన్ని పెట్టి మూసేసి, చపాతీలు ఒత్తుకోవాలి. ఈ చపాతీలను రెండు వైపులా నూనె వేస్తూ దోరగా వేగించుకోవాలి.

Updated Date - 2016-05-24T15:06:41+05:30 IST