చెన్నై రసం

ABN , First Publish Date - 2017-07-01T18:17:24+05:30 IST

కావలసినవి చింతపండు - ఓ మాదిరి ఉసిరికాయంత సైజులో, టొమాటో (మరీ పెద్దది, మరీ చిన్నది కాకుండా మీడియం సైజు)- ఒకటి,

చెన్నై రసం

కావలసినవి
 
చింతపండు - ఓ మాదిరి ఉసిరికాయంత సైజులో, టొమాటో (మరీ పెద్దది, మరీ చిన్నది
కాకుండా మీడియం సైజు)- ఒకటి, మిరియాలు, జీలకర్ర- ఒక్కో టేబుల్‌ స్పూన్‌ చొప్పున, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, పసుపు - చిటికెడు, నూనె - రెండు టీస్పూన్లు, ఆవాలు - ఒక టీస్పూన్‌, కరివేపాకు - ఒక రెమ్మ, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - రుచికి సరిపడా.
 
తయారీ విధానం
చింతపండుని అర కప్పు నీళ్లలో నానబెట్టాలి. అందులోనే చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేయాలి.
తరువాత చింతపండు రసం పిండి పక్కన పెట్టాలి.
టొమాటోలను నలిపి చింతపండు రసంలో కలపాలి.
మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఒక ఎండుమిర్చిని మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్‌ చేయాలి.
పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు వేయాలి. అవి చిటపటమంటున్నప్పుడు రెండు ఎండుమిర్చి, కరివేపాకులు వేయాలి.
ఇందులో తయారుచేసుకున్న చింతపండు రసాన్ని, మిక్సీ పట్టిన పొడి, ఉప్పు వేసి వేడిచేయాలి.
ఉడుకుపట్టి నురగలా రావడం మొదలవ్వగానే స్టవ్‌ ఆపేయాలి. అంతకంటే ఎక్కువగా ఉడికిస్తే చేదెక్కుతుంది. కొత్తిమీర తరుగుతో అలంకరిస్తే రుచికరమైన రసం సిద్ధం.

Updated Date - 2017-07-01T18:17:24+05:30 IST