మష్రూమ్స్ సూప్‌

ABN , First Publish Date - 2017-07-01T19:24:54+05:30 IST

కావలసిన పదార్థాలు మష్రూమ్స్‌ - 400 గ్రా., ఉల్లికాడల తరుగు - అరకప్పు, వెజిటబుల్‌ స్టాక్‌ - 2 కప్పులు,

మష్రూమ్స్ సూప్‌

కావలసిన పదార్థాలు
 
మష్రూమ్స్‌ - 400 గ్రా., ఉల్లికాడల తరుగు - అరకప్పు, వెజిటబుల్‌ స్టాక్‌ - 2 కప్పులు, బటర్‌ - 3 టేబుల్‌ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌ - 1 టేబుల్‌ స్పూను, పాలు - 1 కప్పు, ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత, కొత్తిమీర తరుగు - అరకప్పు.
 
తయారుచేసే విధానం
 
బటర్‌లో మష్రూమ్స్‌ ముక్కలు, ఉల్లికాడల తరుగు వేసి మెత్తబడేవరకు వేగించాలి (మష్రూమ్స్‌ నుండి నీరు ఊరుతుంది. ఆ నీటిని పారబోయకూడదు). ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి మరికొద్ది సేపు మగ్గించి దించేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ముక్కల్ని మిక్సీలో పేస్టులా చేసుకుని వెజిటబుల్‌ స్టాక్‌తో పాటు మరిగించాలి. తర్వాత పాలు, నీటిలో కరిగించిన కార్న్‌ఫ్లోర్‌ కలపాలి. దించేముందు కొత్తిమీర చల్లాలి. ఈ సూప్‌ బ్రెడ్‌ / పిజ్జాలతో సైడ్‌ డిష్‌గా సిప్‌ చేస్తే బాగుంటుంది.

Updated Date - 2017-07-01T19:24:54+05:30 IST