సీక్‌ కబాబ్‌

ABN , First Publish Date - 2015-11-21T18:42:43+05:30 IST

కావలసిన పదార్థాలు : మటన్‌ ఖీమా-కేజి, నెయ్యి-పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు-పావు కప్పు, అల్లం ముక్కలు-పావు కప్పు, పచ్చిమిర్చి(ముక్కలుగా తరగాలి)-రెండు,

సీక్‌ కబాబ్‌

కావలసిన పదార్థాలు : మటన్‌ ఖీమా-కేజి, నెయ్యి-పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు-పావు కప్పు, అల్లం ముక్కలు-పావు కప్పు, పచ్చిమిర్చి(ముక్కలుగా తరగాలి)-రెండు, కొత్తిమీర(తరగాలి)-ముప్పావు కప్పు, బాదంపప్పు ముక్కలు-ముప్పావు కప్పు, కోడిగుడ్లు-రెండు, తెల్ల మిరియాల పొడి-అర టీస్పూన్‌, గరం మసాల పొడి-రెండు టీస్పూన్లు, ఉప్పు-రుచికి సరిపడా.
తయారుచేసే విధానం : మటన్‌ ఖీమా, నెయ్యి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, బాదంపప్పు ముక్కలు, కోడిగుడ్ల సొన, మిరియాల పొడి, గరం మసాల పొడి, ఉప్పు అన్నీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 12 సమభాగాలుగా చేసి, ఒక భాగాన్ని సీకుల పొడవునా చుట్టూ పెట్టాలి. తర్వాత వీటిని జాగ్రత్తగా చార్‌కోల్‌ గ్రిల్‌పైనగాని, లేదంటే ఓవెన్‌ ట్రేలో ఉంచిగాని 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద 20 నిమిషాలపాటు బేక్‌ చేయాలి.

Updated Date - 2015-11-21T18:42:43+05:30 IST