వెజిటబుల్‌ పాస్తా సూప్‌

ABN , First Publish Date - 2015-12-25T15:30:40+05:30 IST

కావలసిన పదార్థాలు: ఉడికించిన పాస్తా - 1 కప్పు, క్యారెట్‌ ముక్కలు - అర కప్పు, బీన్స ముక్కలు - పావు కప్పు, ఉల్లితరుగు - పావు కప్పు, క్యాప్సికమ్‌ తరుగు - పావు కప్పు,

వెజిటబుల్‌ పాస్తా సూప్‌

కావలసిన పదార్థాలు: ఉడికించిన పాస్తా - 1 కప్పు, క్యారెట్‌ ముక్కలు - అర కప్పు, బీన్స ముక్కలు - పావు కప్పు, ఉల్లితరుగు - పావు కప్పు, క్యాప్సికమ్‌ తరుగు - పావు కప్పు, ఉల్లికాడల తరుగు - పావు కప్పు, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - 1 టీ స్పూను
తయారీ విధానం: స్టవ్‌ మీద పాన పెట్టి అందులో వెన్న వేసి వేడయ్యాక కూరగాయ ముక్కలను వేసి పచ్చి వాసన పోయే వరకూ వేయించాలి. ఇప్పుడు కూరగాయలన్నీ వేగాక నాలుగు కప్పుల నీరు, పాస్తా, ఉప్పు, మిరియాల పొడి వేసి మరిగించి దింపేయాలి. ఉల్లికాడల తరుగుతో గార్నిష్‌ చేసుకోవాలి. అంతే, వెజిటబుల్‌ పాస్తా సూప్‌ రెడీ.

Updated Date - 2015-12-25T15:30:40+05:30 IST