నూల్‌ కోల్‌ సూప్‌

ABN , First Publish Date - 2015-09-02T22:30:40+05:30 IST

కావలసిన పదార్థాలు: నూల్‌కోల్‌ (ఆకులతో పాటు) - 1, ఉల్లిపాయ - 1, టమోటా - 1, క్యారెటు

నూల్‌ కోల్‌ సూప్‌

కావలసిన పదార్థాలు
 
నూల్‌కోల్‌ (ఆకులతో పాటు) - 1, ఉల్లిపాయ - 1, టమోటా - 1, క్యారెటు - చిన్నముక్క, మిరియాల పొడి - 1 టీ స్పూను చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, వెల్లుల్లి - అర టీ స్పూను, లవంగం -1, దాల్చినచెక్క - అరంగుళం ముక్క, బిర్యానీ ఆకు - 1.
 
తయారీ విధానం
 
 రెండు కప్పుల నీటిలో నూల్‌కోల్‌, క్యారెట్‌, ఉల్లిపాయ, టమోటా ముక్కలతో పాటు దాల్చినచెక్క, బిర్యాని ఆకు, లవంగం వేసి ఉడికించాలి. చల్లారిన తర్వాత వడకట్టి మిర్యాలపొడి, ఉప్పు కలిపి ఒక పొంగు వచ్చాక దించేయాలి. సూపు వేడి వేడిగా ఉన్నప్పుడే బ్రెడ్‌ ముక్కలు నంజుకుంటూ తాగితే బాగుంటుంది.

Updated Date - 2015-09-02T22:30:40+05:30 IST