పచ్చిపులుసు

ABN , First Publish Date - 2015-09-02T20:37:37+05:30 IST

కావలసిన పదార్థాలు: చింతపండు - 50 గ్రాములు, నీరు - 4 కప్పులు, (వేగించిన) నువ్వుల పొడి - 50 గ్రా

పచ్చిపులుసు

కావలసిన పదార్థాలు: చింతపండు - 50 గ్రాములు, నీరు - 4 కప్పులు, (వేగించిన) నువ్వుల పొడి - 50 గ్రా., ఉల్లి తరుగు -1 కప్పు, కారం - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను, ఎండుమిర్చి -4, ఆవాలు + జీలకర్ర - అర టీ స్పూను చొప్పున, నూనె - 2 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం: చింతపండుని నానబెట్టి గుజ్జుతీసి (పిప్పిలేకుండా) నీటిని జతచేసి ఉల్లి తరుగు, కారం, కొత్తిమీర తరుగు, నువ్వులపొడి, తగినంత ఉప్పు వేసి పక్కనుంచాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్రతో తాలింపు పెట్టి చింతపండు మిశ్రమంలో కలపాలి. తినడానికి ముందు ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడ్డాక అన్నంలో కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. షర్బత్‌లా తాగినా మంచిదే.

Updated Date - 2015-09-02T20:37:37+05:30 IST