పొడి పచ్చిపులుసు

ABN , First Publish Date - 2015-09-02T20:46:11+05:30 IST

కావలసిన పదార్థాలు: చింతపండు గుజ్జు - 3 టేబుల్‌ స్పూన్లు, టమోటాలు - 2, ఉల్లిపాయ (పెద్దది)

పొడి పచ్చిపులుసు

కావలసిన పదార్థాలు: చింతపండు గుజ్జు - 3 టేబుల్‌ స్పూన్లు, టమోటాలు - 2, ఉల్లిపాయ (పెద్దది) - 1, పచ్చిమిర్చి - 2, పల్లీలు - 2 టేబుల్‌ స్పూన్లు, నువ్వులు - 1 టేబుల్‌ స్పూను, కారం, జీరా, మెంతి, దనియాల పొడులు - అర టీ స్పూను చొప్పున, తాలింపు కోసం - సరిపడా దినుసులు.
తయారుచేసే విధానం: నువ్వులు, పల్లీలు విడివిడిగా వేగించి, చల్లార్చి మిగతా పొడులతో పాటు పొడి చేసుకోవాలి. టమోటాలు, ఉల్లి, పచ్చిమిర్చి సన్నగా తరగాలి. చింతపండు గుజ్జులో పొడి మిశ్రమంతో పాటు 4 కప్పుల నీటిని కలిపి తగినంత ఉప్పు వేయాలి. టీ స్పూను నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. ఇప్పుడు చింతపండు నీళ్లు, పొడుల మిశ్రమం కలిపి 5 నిమిషాలు మరిగించి, దించేముందు కొత్తిమీర చల్లాలి. అన్నంలో కలుపుకుని వడియాలు నంజుకుంటే చాలా రుచిగా ఉండే పచ్చిపులుసు ఇది.

Updated Date - 2015-09-02T20:46:11+05:30 IST