క్యారెట్ - అల్లం సూప్

ABN , First Publish Date - 2016-09-12T15:50:31+05:30 IST

సన్నగా తరిగిన క్యారెట్‌- మూడు కప్పులు, తరిగిన ఆకుకూరలు- ఒక కప్పు, అల్లం తురుము- పావు కప్పు, నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర- ఒక టీ

క్యారెట్ - అల్లం సూప్

కావలసిన పదార్థాలు: సన్నగా తరిగిన క్యారెట్‌- మూడు కప్పులు, తరిగిన ఆకుకూరలు- ఒక కప్పు, అల్లం తురుము- పావు కప్పు, నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర- ఒక టీ స్పూను, వాము- అర టీ స్పూను, ఇంగువ- చిటికెడు, ఉప్పు- ఒక టీ స్పూను, చక్కెర- రెండు టీ స్పూన్లు, నిమ్మరసం- రెండు టీ స్పూన్లు, మిరియాల పొడి- పావు టీ స్పూను. 

తయారీ విధానం: బాణలిలో నూనె పోసి వేడెక్కాక జీలకర్ర, వాము, ఇంగువ వేసి వేగించాలి. ఆ తర్వాత క్యారెట్‌, ఆకుకూరలు, అల్లం తురుము వేసి మరో 10 నిమిషాలు వేగించి నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత ఉప్పు, చక్కెర వేసి చిక్కబడేంత వరకూ ఉడికించి దింపేయాలి. చివర్లో మిరియాల పొడి, నిమ్మరసం వేసి కలిపి వేడి వేడిగా తాగాలి.

Updated Date - 2016-09-12T15:50:31+05:30 IST