బోటీ కబాబ్‌

ABN , First Publish Date - 2015-11-07T14:52:02+05:30 IST

కావలసిన పదార్థాలు: మటన్‌- అరకిలో, గరంమసాల -ఒక టేబుల్‌ స్పూను, పెరుగు - ఒక కప్పు, ఉప్పు - తగినంత, నూనె

బోటీ కబాబ్‌

కావలసిన పదార్థాలు: మటన్‌- అరకిలో, గరంమసాల -ఒక టేబుల్‌ స్పూను, పెరుగు - ఒక కప్పు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. ఉల్లిపాయ ముక్కలు - కొద్దిగా, కొత్తిమీర - ఒక కట్ట, నిమ్మకాయ - ఒకటి.
తయారుచేయు విధానం: మటన్‌ని శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, గరం మసాలా, పెరుగు వేసి ఒక గంట సేపు నానపెట్టాలి. తర్వాత వీటిని ఇనుపచువ్వకి ఒక్కొక్కటీ గుచ్చాలి. ఇప్పుడు బొగ్గుల పొయ్యిని వెలిగించాలి. ఎర్రటి నిప్పులపై ఈ ఇనుపచువ్వని తిప్పుతూ కాల్చాలి. ముక్కలు ఎర్రగా కాలాక తీసేయాలి. వీటిని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో వడ్డించాలి. ఇష్టపడేవారు నిమ్మకాయ పిండుకుని తింటారు.

Updated Date - 2015-11-07T14:52:02+05:30 IST