Advertisement
Advertisement
Abn logo
Advertisement

టమోటా బజియా

కావలసిన పదార్థాలు: గుండ్రని గట్టి టమాటాలు - 6, వేగించడానికి తగినంత నూనె.
టమేటోల్లో కూరడానికి: మిక్చర్‌ - ఒక కప్పు పసుపు - అరస్పూను, ధనియా, జీరా పొడి - 2 టీ స్పూన్లు, కారం - 2 టీ స్పూన్లు, పంచదార - 2 టీ స్పూన్లు, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు- రుచికి తగినంత. టమేటోల పై పిండికి : శనగపిండి - ఒక కప్పు ఉప్పు- తగినంత, పసుపు - చిటికెడు, వేడి నూనె - ఒక టేబుల్‌ స్పూను, నీరు - సరిపడా, ఎరుపురంగు - చిటికెడు.
తయారుచేసే విధానం
టమోటాల తొడిమల్ని తీసి అక్కడే చాలా జాగ్రత్తగా గుండ్రని గాటు పెట్టి లోపలి గుజ్జు తీసివేసి ఓ పక్కనుంచుకోవాలి. వాటిల్లో నింపుకోడానికి కావలసిన పదార్థాలను బాగా కలుపుకుని టమాటోల్లో కూరుకుని అవసరం వచ్చేదాకా ఫ్రిజ్‌లో ఉంచాలి. శనగపిండిలో ఉప్పు, పసుపు, వేడి నూనె, సరిపడా నీళ్లు వేసి బజ్జీల పిండిలా జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రిజ్‌లోని టమాటోలను తీసి పిండిలో ముంచి కడాయిలో నూనె వేడెక్కాక ఒక్కొక్కటిగా వేస్తూ బంగారురంగు వచ్చేదాక వేగించాలి. వీటిని వేడివేడిగా పెరుగు పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటాయి.

ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ట్రా‘ఫికర్‌’ఘనంగా సంక్రాంతి వేడుకలుక్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందిఉపాధ్యాయులకు బదిలీలు సహజంకోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడులుఅసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు సన్మానం పండుగ పూట విషాదంఏఐటీయూసీ సమావేశాలను విజయవంతం చేయండిప్రభుత్వం రైతులను ఆదుకోవాలి అభివృద్ధికి నోచుకోని గ్రంథాలయాలు
Advertisement