అరటిపండు డ్రై బర్ఫి

ABN , First Publish Date - 2015-08-30T22:35:26+05:30 IST

కావలసిన పదార్ధాలు : మైదాపిండి - కప్పు, అరటిపండు గుజ్జు - కప్పు డాల్డా లేదా నెయ్యి - ఒకటిన్నర కప్పు వెన్న - రెండు చెంచా పంచదార -

అరటిపండు డ్రై బర్ఫి

కావలసిన పదార్ధాలు : మైదాపిండి - కప్పు, అరటిపండు గుజ్జు - కప్పు డాల్డా లేదా నెయ్యి - ఒకటిన్నర కప్పు  వెన్న - రెండు చెంచా పంచదార - పావు కిలో కిస్‌మిస్‌లు - 20 యాలకులు - 5బాదం పప్పు - 20గ్రా జీడిపప్పు - 20గ్రా
తయారీ విధానం :
ముందుగా మైదాను శుభ్రంగా జల్లించుకోవాలి. అరటిపండును తొక్కతీసి గుజ్జుగా చేసుకోవాలి. ఇప్పుడు ఓ పాత్రలో మైదా, అరటిపండు గుజ్జు వేసి అందులో వెన్న వేసి ముద్దలా కలపాలి. తరువాత ఓ బాణలిలో కిద్దిగా నెయ్యి వేసి అందులో జీడిపప్పును వేయించి తీసేయాలి. ఇప్పుడా బాణలిలో మరో రెండు చెంచాల నెయ్యిని వేసి ముద్దగా చేసిపెట్టుకున్న మైదా మిశ్రమాన్ని అందులో వేసి దోరగా వేయించాలి. ఇలా చేయడం వల్ల ముద్ద పచ్చివాసన పోతుంది. ఇప్పుడీ ముద్దలో కిస్‌మిస్‌, జీడిపప్పు, యాలకులు పొడి వేసి మెత్తగా పూరీల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడా పిడిని చిన్న చిన్న బిళ్లల్లా చేతితో పట్టుకుని వత్తుకోవాలి. ఇలా బిళ్లల్లా వత్తుకున్న తరువాత బాణలిలో నెయ్యి వేసి కరిగిన తరువాత ఈ బిళ్లలను వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. వేయించిన తీసిన బిళ్లలను ఓ ప్లేటులో కింద పేపర్‌ పెట్టి వీటిని సర్ది పైన పంచదార చల్లుకుంటే అరటిపండు డ్రై బర్ఫీ సిద్ధమయినట్లే!

Updated Date - 2015-08-30T22:35:26+05:30 IST