Abn logo

పెరుగు సద్ది

కావలసినవి
 
అన్నం - 1 గ్లాసు, పెరుగు - 1 గ్లాసు, పాలు - అర గ్లాసు, ఎండుమిరపకాయలు - 3, మినప్పప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, సెనగపప్పు - రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు, జీలకర్ర - అర టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, కరివేపాకు - 2 రెబ్బలు, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత.
 
తయారీవిధానం
 
అన్నం మెత్తగా వండి పెట్టుకోవాలి. ఇందులో పెరుగు, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఒక చిన్న గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేసి ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయాలి. తర్వాత మినప్పప్పు, సెనగప్పప్పు వేసి కాస్త వేగాక కరివేపాకులు వేసి దింపి, కలిపి ఉంచుకున్న పెరుగన్నంలో కలపాలి. ఇందులో గోరువెచ్చని పాలు వేసి కలిపి మూతపెట్టి పది నిమిషాల తర్వాత వడ్డించాలి. పాలు కలపడం వల్ల ఈ అన్నం పులుపెక్కకుండా కమ్మగా ఉంటుంది.

మటర్‌ పులావ్‌పన్నీర్ పులావ్ (వీడియో) ప్రసాదం పులిహోరపాలకూర పలావ్‌జీడిపప్పు పులావ్‌దద్దోజనంస్వీట్‌కార్న్‌ పలావ్‌ క్యారెట్ రైస్పనసకాయ బిర్యానివాంగీబాత్‌
Advertisement
Advertisement