దొండకాయ మసాలా కర్రీ

ABN , First Publish Date - 2019-10-12T16:41:46+05:30 IST

దొండకాయలు - అరకిలో, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - మూడు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, ధనియాలు - ఒక టేబుల్‌స్పూన్‌, కొబ్బరి తురుము - రెండు టేబుల్‌స్పూన్లు

దొండకాయ మసాలా కర్రీ

కావలసిన పదార్థాలు: దొండకాయలు - అరకిలో, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - మూడు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, ధనియాలు - ఒక టేబుల్‌స్పూన్‌, కొబ్బరి తురుము - రెండు టేబుల్‌స్పూన్లు, నువ్వులు, బెల్లం - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, దాల్చినచెక్క - చిన్నముక్క, లవంగాలు - నాలుగు, చింతపండు - నిమ్మకాయంత, కరివేపాకు - కొద్దిగా, ఎండుమిర్చి - రెండు
 
తయారీ విధానం:
దొండకాయలను నిలువుగా చీల్చి ఉడికించాలి. ఒక పాన్‌ తీసుకొని నూనె వేసి కాస్త వేడి అయ్యాక ధనియాలు, దాల్చినచెక్క, నువ్వులు వేగించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో టేబుల్‌స్పూన్‌ నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేగించాలి. కొబ్బరి తురుము వేసి మరికాసేపు వేగించి పక్కన పెట్టాలి. అన్నింటినీ మిక్సీలో గ్రైండ్‌ చేయాలి. అల్లంవెల్లుల్లి పేస్టు, బెల్లం, చింతపండు, వేగించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొబ్బరితురుము, ఉప్పు వేసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించిన దొండకాయలలో కూరాలి. ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేగించాలి. తరువాత దొండకాయలు వేసి చిన్న మంటపై ఫ్రై చేయాలి. ఈ దొండకాయ మసాలా కూర అన్నంలోకి రుచిగా ఉంటుంది.

Updated Date - 2019-10-12T16:41:46+05:30 IST