కాలీఫ్లవర్‌ పరాఠా

ABN , First Publish Date - 2015-08-30T23:09:36+05:30 IST

కావలసిన పదార్థాలు : గోఽఽధుమపిండి - 400గ్రా., కాలీఫ్లవర్‌ - 200 గ్రా., కరివేపాకు - 4 రెబ్బలు, పచ్చిమిర్చి - 2

కాలీఫ్లవర్‌ పరాఠా

కావలసిన పదార్థాలు : గోఽఽధుమపిండి - 400గ్రా., కాలీఫ్లవర్‌ - 200 గ్రా., కరివేపాకు - 4 రెబ్బలు, పచ్చిమిర్చి - 2, అల్లం - అంగుళం ముక్క, ఉప్పు, కారం, గరం మసాలా - రుచికి తగినంత, వాము (ఇష్టమైతే) - అరటీస్పూను, నూనె వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం : ముందుగా గోధుమపిండిని నీటితో తడిపి ముద్దలా చేసి పక్కనుంచుకోవాలి. సన్నగా తరిగిన కాలీఫ్లవర్‌, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లంతో పాటు కారం, గరంమసాలా, వాము, ఉప్పుని ఒక పాత్రలో వేసి కలుపుకోవాలి. పిండిని సమభాగాలుగా చేసి ఒక పరాఠాకి రెండేసి చపాతీల్లా చేసుకోవాలి. ఒక చపాతీ పైన కాలీఫ్లవర్‌ మిశ్రమాన్ని పరిచి, పైన మరో చపాతీ ఉంచి రొట్టెల కర్రతో రుద్దాలి. (రెండూ అతుక్కుపోయి కాస్త పెద్ద చపాతీ అవుతుంది). తర్వాత పెనంపైన నూనెతో రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. వీటిని దోసకాయ, పెరుగు చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-08-30T23:09:36+05:30 IST