కొర్ర ఇడ్లీ

ABN , First Publish Date - 2019-11-04T15:59:24+05:30 IST

కొర్రలు - 100 గ్రా., మినప పప్పు - 100 గ్రా., ఇడ్లీ రవ్వ - 100 గ్రా., ఉప్పు - తగినంత

కొర్ర ఇడ్లీ

కావలసిన పదార్థాలు : కొర్రలు - 100 గ్రా., మినప పప్పు - 100 గ్రా., ఇడ్లీ రవ్వ - 100 గ్రా., ఉప్పు - తగినంత
 
తయారీ విధానం : కొర్రలు, మినప పప్పు, ఇడ్లీ రవ్వని వేరు వేరుగా నానబెట్టాలి. కొర్రలు, మినప పప్పు రెండింటిని రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో ఇడ్లీ రవ్వ కలిపి ఒక రాత్రి పక్కనుంచాలి. తరువాత రోజు పై మిశ్రమానికి ఉప్పు కలిపి ఇడ్లీలు వేసుకోవాలి.
 
పోషక విలువలు : 100 గ్రాముల ఈ పదార్థంలో శక్తి 341 కి.కెలోరీలు, ప్రొటీన్లు 14.2 గ్రా., కొవ్వు 2 గ్రా., కాల్షియం 64 మి.గ్రా., భాస్వరం 272.6 మి.గ్రా., ఇనుము 2.5 మి.గ్రా.

Updated Date - 2019-11-04T15:59:24+05:30 IST