వంకాయ పచ్చి పులుసు

ABN , First Publish Date - 2015-09-02T20:55:50+05:30 IST

కావలసిన పదార్థాలు: పెద్ద వంకాయ - 1, ఉల్లి తరుగు - 1 కప్పు, చింతపండు - నిమ్మకాయంత

వంకాయ పచ్చి పులుసు

కావలసిన పదార్థాలు: పెద్ద వంకాయ - 1, ఉల్లి తరుగు - 1 కప్పు, చింతపండు - నిమ్మకాయంత, పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు, బెల్లం - ఒకటిన్నర టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు - అరకప్పు, నీరు - ఒకటిన్నర కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, తాలింపు కోసం: ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ, వెల్లుల్లి రేకలు, కరివేపాకు, నూనె - సరిపడా.
తయారుచేసే విధానం: చింతపండు నానబెట్టి రసం తీయాలి. వంకాయకు నూనె రాసి మంట మీద అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. చల్లారిన తర్వాత తొక్క తీసి గుజ్జు మెదపాలి. ఒక పాత్రలో గుజ్జుతో పాటు ఉల్లి, పచ్చిమిర్చి, బెల్లం తరుగు, చింతపండు రసం, ఉప్పువేసి అన్నీ కలిసేలా చేత్తో పిసికి నీరు పోయాలి. తర్వాత తాలింపు చేర్చి, కొత్తిమీర చల్లాలి. ఇది అన్నంతో పాటు పులగంలోకి కూడా బాగుంటుంది.

Updated Date - 2015-09-02T20:55:50+05:30 IST