అరికల ఇడ్లీ

ABN , First Publish Date - 2019-05-18T21:38:09+05:30 IST

అరికలు - 100 గ్రా., మినపప్పు - 100 గ్రా., ఇడ్లీ రవ్వ - 100 గ్రా., ఉప్పు - తగినంత...

అరికల ఇడ్లీ

కావలసిన పదార్థాలు
 
అరికలు - 100 గ్రా., మినపప్పు - 100 గ్రా., ఇడ్లీ రవ్వ - 100 గ్రా., ఉప్పు - తగినంత.
 
తయారీ విధానం:
 
అరికలు, మినపప్పు, ఇడ్లీరవ్వలు వేరువేరుగా నానబెట్టాలి. అరికలు, మినపప్పు రెండింటిని కలిపి రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో ఇడ్లీరవ్వ వేసి ఒక రాత్రి ఉంచాలి. తరువాత రోజు ఆ మిశ్రమంలో ఉప్పు కలిపి, ఇడ్లీలు వేసుకోవాలి.
పోషక విలువలు : 100 గ్రాముల ఈ పదార్థంలో శక్తి 336.6 కి.కెలోరీలు, ప్రొటీన్లు 13 గ్రా., కొవ్వు 1.1 గ్రా., కాల్షియం 63.6 మి.గ్రా., భాస్వరం 244.3 మి.గ్రా., ఇనుము 1.6 మి.గ్రా.

Updated Date - 2019-05-18T21:38:09+05:30 IST