కొర్రల వెజిటబుల్‌ బిర్యాని

ABN , First Publish Date - 2019-05-25T20:14:34+05:30 IST

కొర్రలు - 100 గ్రా., ఉల్లిపాయలు - 25 గ్రా., క్యారెట్‌ - 10 గ్రా., నెయ్యి - 20 గ్రా., మసాలా దినుసులు

కొర్రల వెజిటబుల్‌ బిర్యాని

కావలసిన పదార్థాలు
 
కొర్రలు - 100 గ్రా., ఉల్లిపాయలు - 25 గ్రా., క్యారెట్‌ - 10 గ్రా., నెయ్యి - 20 గ్రా., మసాలా దినుసులు - 15 గ్రా., జీడిపప్పు - 20 గ్రా., టమాటాలు - 20 గ్రా., కొత్తిమీర - 10 గ్రా., పుదీన - 10 గ్రా., పచ్చిమిర్చి - 5 గ్రా., అల్లం - 5 గ్రా., వెల్లుల్లి - 5 గ్రా., ఉప్పు - తగినంత, బంగాళ దుంప -1.
 
తయారీ విధానం
 
కొర్రల్ని 2 గంటలు ముందుగా నానబెట్టాలి. నూనె వేడి చేసి మసాలా దినుసులు, జీడిపప్పు, తరిగిన పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించాలి. తరువాత తరిగిన క్యారెట్‌లు, బంగాళదుంప, బీన్స్‌ వేసి 10 నిమిషాలు వేయించాలి. దీనిలో కొత్తిమీర, పుదీన వేయాలి. 3 కప్పుల నీరుపోసి మరిగించాలి. మరిగిన నీటిలో కొర్రలు వేసి ఉడికించాలి. బిర్యాని పూర్తిగా ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీన చల్లి వడ్డించాలి.
పోషక విలువలు: 100 గ్రాముల ఈ పదార్థంలో శక్తి 313.48 కి. కెలోరీలు, ప్రొటీన్లు 6 గ్రా., కొవ్వు 27.1 గ్రా., కాల్షియం 36.79 మి.గ్రా., భాస్వరం 161.34 మి.గ్రా., ఇనుము 2.40 మి.గ్రా.

Updated Date - 2019-05-25T20:14:34+05:30 IST