కార్న్‌ చాట్‌

ABN , First Publish Date - 2020-01-18T17:44:52+05:30 IST

కార్న్‌(మొక్కజొన్న) - రెండు కప్పులు, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - రుచికి, తగినంత, ఉల్లిపాయలు - రెండు, క్యాప్సికం - ఒకటి, టొమాటో కెచప్‌ - రెండు, టేబుల్‌స్పూన్లు, ఎండు మిర్చి - ఒకటి.

కార్న్‌ చాట్‌

కావలసినవి : కార్న్‌(మొక్కజొన్న) - రెండు కప్పులు, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - రుచికి, తగినంత, ఉల్లిపాయలు - రెండు, క్యాప్సికం - ఒకటి, టొమాటో కెచప్‌ - రెండు, టేబుల్‌స్పూన్లు, ఎండు మిర్చి - ఒకటి.
 
తయారీ: ఒక పాత్రలో కార్న్‌ తీసుకొని అందులో వెన్న వేసి కలపాలి.
ఓవెన్‌లో పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత బయటకు తీసి ఉల్లిపాయలు, క్యాప్సికం, టొమాటో కెచప్‌, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఓవెన్‌లో మరో ఐదు నిమిషాలు ఉడికించాలి.
పొడి పొడిగా దంచుకున్న ఎండు మిర్చిని చల్లుకుని సర్వ్‌ చేసుకోవాలి.
ఈ కార్న్‌ చాట్‌ వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది.

Updated Date - 2020-01-18T17:44:52+05:30 IST