చిలగడ దుంపల జామూన్‌

ABN , First Publish Date - 2015-09-01T22:25:01+05:30 IST

కావలసిన పదార్థాలు : ఉడికించిన చిలగడ దుంపలు - అరకేజీ, మైదా - 100 గ్రా.,

చిలగడ దుంపల జామూన్‌

కావలసిన పదార్థాలు : ఉడికించిన చిలగడ దుంపలు - అరకేజీ, మైదా - 100 గ్రా., పంచదార - అరకేజీ, నీరు - అర లీటరు, యాలకులు - 5, నెయ్యి - 50 గ్రా., సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ - పావుకేజీ.
తయారుచేసే విధానం : ఉడికించి తొక్కతీసి, మెత్తగా చిదిమిన చిలగడ దుంపల్లో మైదా కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. కడాయిలో నెయ్యి, నూనె కలిపి సన్నసెగ మీద ఉండలను దోరగా వేగించి పెట్టుకోవాలి. మరో కడాయిలో చక్కెర, నీరు కలిపి పాకం తీయాలి. చిలగడ ఉండలను ఆ పాకంలో వేసి చల్లారనివ్వాలి. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు. వీటిని చేయడం కూడా సులువు.

Updated Date - 2015-09-01T22:25:01+05:30 IST