మటర్‌ పనీర్‌

ABN , First Publish Date - 2019-07-13T20:35:18+05:30 IST

పనీర్‌ - రెండు కప్పులు, పచ్చిబఠాణీ - రెండు కప్పులు, పచ్చిమిర్చి - నాలుగు, ఉల్లిపాయలు - రెండు..

మటర్‌ పనీర్‌

కావలసినవి
 
పనీర్‌ - రెండు కప్పులు, పచ్చిబఠాణీ - రెండు కప్పులు, పచ్చిమిర్చి - నాలుగు, ఉల్లిపాయలు - రెండు, వెల్లుల్లి రెబ్బలు - రెండు, అల్లం - చిన్నముక్క, టొమాటోలు - రెండు, నూనె - పావు కప్పు, జీలకర్ర - రెండు టీస్పూన్లు, బిర్యానీ ఆకులు - రెండు, పసుపు - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి- చిటికెడు, ధనియాల పొడి - ఒక టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర - ఒకకట్ట.
 
తయారీవిధానం
 
ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలను పేస్టులా చేసుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక జీలకర్ర, బిర్యాని ఆకు వేసి వేగించాలి. తరువాత ఉల్లిపాయ పేస్టును వేయాలి. గోధుమ రంగు వచ్చే వరకు వేగించుకోవాలి. టొమాటో ముక్కలు, పసుపు, గరంమసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి మరి కాసేపు వేగించాలి.
పచ్చి బఠాణి, పనీర్‌, పచ్చి మిర్చి వేసి, కలిపి మరికాసేపు ఫ్రై కానివ్వాలి. రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. పది నిమిషాల పాటు చిన్న మంటపై ఉడకనివ్వాలి. కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి.

Updated Date - 2019-07-13T20:35:18+05:30 IST