సాబూదానా కిచిడీ

ABN , First Publish Date - 2019-03-02T22:09:26+05:30 IST

సాబూదానా(సగ్గుబియ్యం) - ఒక కప్పు, శనగలు - ఒక కప్పు(ఉడికించుకోవాలి), నెయ్యి - 2 టేబుల్‌స్పూన్‌లు...

సాబూదానా కిచిడీ

కావలసిన పదార్థాలు
సాబూదానా(సగ్గుబియ్యం) - ఒక కప్పు, శనగలు - ఒక కప్పు(ఉడికించుకోవాలి), నెయ్యి - 2 టేబుల్‌స్పూన్‌లు, జీలకర్ర - 1 టేబుల్‌స్పూనులు, ఎండు మిర్చి - 4, కరివేపాకు - ఒక కట్ట, రాతి ఉప్పు - 2 టీ స్పూనులు, మిరపపొడి - 1 టీ స్పూన్‌, కొత్తిమీర - ఒక కట్ట
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగి), నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌.
 
తయారుచేయు విధానం: ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి, ఒక గంటపాటు నానబెట్టుకోవాలి. తరువాత నీటిని పారబోసి సగ్గుబియాన్ని వస్త్రంలో పోసి మరోగంట పాటు పెట్టాలి. నీరు పూర్తిగా పోవడానికి ఇలా చేయడం తప్పనిసరి. తరువాత సాబూదానా, శనగలు, ఉప్పు, మిరపపొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రను స్టవ్‌ మీద పెట్టి కాస్త వేడి అయ్యాక నెయ్యి వేసి అందులో జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. తరువాత సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేసి చిన్న మంటపై ఉడికించాలి. కాసేపు ఉడికిన తరువాత నిమ్మరసం కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర, తరిగిన పచ్చి మిర్చితో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేయాలి.

Updated Date - 2019-03-02T22:09:26+05:30 IST