పాలక్‌ పరాటా

ABN , First Publish Date - 2015-09-02T21:52:02+05:30 IST

కావలసిన పదార్థాలు: గోఽఽధుమపిండి - ఒకటిన్నర కప్పు, నెయ్యి - 2 టీ స్పూన్లు, జీలకర్రపొడి - అర టీస్పూను

పాలక్‌ పరాటా

కావలసిన పదార్థాలు: గోధుమపిండి - ఒకటిన్నర కప్పు, నెయ్యి - 2 టీ స్పూన్లు, జీలకర్రపొడి - అర టీస్పూను, వాము - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, (వేగించడానికి) నెయ్యి, నూనె -1 టేబుల్‌ స్పూను చొప్పున.
పేస్టు కోసం: పాలకూర తరుగు - 2 కప్పులు, అల్లం - అంగుళం ముక్క, పచ్చిమిర్చి - 2 (ఇవన్నీ 2 టేబుల్‌ స్పూన్ల నీటిలో కొద్దిపేపు ఉడికించి గ్రైండ్‌ చేయాలి).
తయారుచేసే విధానం: లోతైన, వెడల్పాటి పాత్రలో గోఽఽధుమపిండి, వాము, జీలకర్రపొడి, ఉప్పు, నెయ్యి వేసి చేత్తో ఒకసారి కలపాలి. తర్వాత పాలకూర పేస్టు కూడా వేసి, కనీసం 10 నిమిషాలపాటు గట్టిగా పిసకాలి. ఆ ముద్దపై తడిబట్ట కప్పి 30 నిమిషాలు పక్కనుంచాలి. ఈ ముద్దని సమభాగాలుగా చేసుకుని, చపాతీల్లా వత్తి నెయ్యి, నూనె మిశ్రమాన్ని పలచగా రాసి, రోల్‌ చేసి, గుండ్రంగా చుట్టాలి. తర్వాత పరాటాలు చేసుకుని రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. వీటికి చట్నీ/ రైతాలు మంచి కాంబినేషన్‌.

Updated Date - 2015-09-02T21:52:02+05:30 IST