స్ట్రాబెర్రీ కార్న్‌ సల్సా

ABN , First Publish Date - 2019-04-10T12:12:04+05:30 IST

తాజా స్ట్రాబెర్రీలు- రెండు కప్పులు, చిన్న టొమాటోలు- రెండు కప్పులు, ఫ్రిజ్‌లో ఉంచిన..

స్ట్రాబెర్రీ కార్న్‌ సల్సా

కావలసినవి: తాజా స్ట్రాబెర్రీలు- రెండు కప్పులు, చిన్న టొమాటోలు- రెండు కప్పులు, ఫ్రిజ్‌లో ఉంచిన మొక్కజొన్న గింజలు (కార్న్‌)- కప్పు, కొత్తిమీర- మూడు టేబుల్‌ స్పూన్లు. ఆలివ్‌ నూనె- పావు కప్పు, వెనిగర్‌- రెండు టేబుల్‌ స్పూన్లు, నిమ్మరసం- రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు- అర టీస్పూను.
 
తయారీ: పెద్ద గిన్నెలో స్ట్రాబెర్రీ, టొమాటో ముక్కలు, మొక్కజొన్న గింజలు, తరిగిపెట్టుకున్న కొత్తిమీర తీసుకోవాలి. చిన్న పాత్ర తీసుకొని అందులో ఆలివ్‌ నూనె, వెనిగర్‌, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ట్రాబెర్రీ ముక్కలున్న పాత్రలో వేసి, మిక్స్‌ చేసి, గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచితే నోరూరించే స్ట్రాబెర్రీ కార్న్‌ సల్సా రెడీ అవుతుంది. దీన్ని చిప్స్‌తో అలంకరించి చల్లచల్లగా అందించాలి.

Updated Date - 2019-04-10T12:12:04+05:30 IST