హాట్‌ ప్రాన్‌

ABN , First Publish Date - 2018-08-25T22:05:51+05:30 IST

టైగర్‌ రొయ్యలు - 350 గ్రా., ఉప్పు - అర టీ స్పూను, మిరియాల పొడి - పావు టీ స్పూను...

హాట్‌ ప్రాన్‌

కావలసిన పదార్థాలు
 
టైగర్‌ రొయ్యలు - 350 గ్రా., ఉప్పు - అర టీ స్పూను, మిరియాల పొడి - పావు టీ స్పూను, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, నువ్వుల నూనె - అర టీ స్పూను, అల్లం తరుగు - ఒక టీ స్పూను, ఉల్లి కాడల తరుగు - ఒక టీ స్పూను, వెల్లుల్లి తరుగు - ఒక టీ స్పూను, ఎండుమిర్చి - 3, పచ్చిమిర్చి - 3, లైట్‌ సోయా సాస్‌ - ఒక టేబుల్‌ స్పూను, చిల్లీ సాస్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, చికెన్‌ స్టాక్‌ - 100 మి.లీ.,
 
తయారుచేసే విధానం
 
శుభ్రం చేసిన రొయ్యల్లో మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి పది నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత ఒక టేబుల్‌ స్పూను నూనెలో రొయ్యల్ని కొద్దిసేపు వేగించి రంగు మారగానే తీసేయాలి. మిగిలిన నూనె, నువ్వుల నూనె వేసి ఉల్లి, అల్లం, వెల్లుల్లి తరుగు, ఎండు మిర్చి, పచ్చిమిర్చి వేగించాలి. తర్వాత సోయాసాస్‌, చిల్లీ సాస్‌, చికెన్‌ స్టాక్‌ ఒకేసారి కలిపి మరిగించాలి. తర్వాత వేగించిన రొయ్యలు, ఉల్లి తరుగు వేసి చిన్నమంటపై తడి ఆవిరయ్యే వరకు ఉంచి దించేయాలి. వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2018-08-25T22:05:51+05:30 IST