చిల్లీ ప్రాన్‌

ABN , First Publish Date - 2018-08-25T22:04:40+05:30 IST

రొయ్యలు - పావు కేజీ, క్యాప్సికం ముక్కలు - ఒక కప్పు, ఎండుమిర్చి - 3, అల్లం+వెల్లుల్లి తరుగు...

చిల్లీ ప్రాన్‌

కావలసిన పదార్థాలు
 
రొయ్యలు - పావు కేజీ, క్యాప్సికం ముక్కలు - ఒక కప్పు, ఎండుమిర్చి - 3, అల్లం+వెల్లుల్లి తరుగు - 2 టీ స్పూన్లు, ఉల్లి తరుగు - అరకప్పు, సోయాసాస్‌ - 2 టీ స్పూన్లు, చిల్లీ సాస్‌ - ఒక టీ స్పూను, మిరియాల పొడి - ఒకటిన్నర టీ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌ - రెండున్నర టేబుల్‌ స్పూన్లు, మైదా - 5 టేబుల్‌ స్పూన్లు, మిరియాలు - అర టీ స్పూను, వెల్లుల్లి గుజ్జు - అర టీ స్పూను, కారం - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేగించడానికి, పచ్చిమిర్చి - 2, ఉల్లి కాడల తరుగు - అలంకరణకు, పంచదార - చిటికెడు.
 
తయారుచేసే విధానం
 
ముందుగా ఒక పాత్రలో మైదా, ఒక టేబుల్‌ స్పూను కార్న్‌ఫ్లోర్‌, ఉప్పు, కారం, టీ స్పూను మిరియాల పొడి, వెల్లుల్లి గుజ్జుతో పాటు తగినంత నీరు పోసి చిక్కగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో రొయ్యలు ముంచి నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. వెడల్పాటి పాన్‌లో 2 టేబుల్‌ స్పూన్లు నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి, కాప్సికం, ఎండు మిర్చి, అల్లం, వెల్లుల్లి తరుగు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. ఇప్పుడు సోయాసాస్‌, చిల్లీ సాస్‌ కలిపి ఒక నిమిషం ఆగి మిగిలిన మిరియాల పొడి వేయాలి. వేగించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి బాగా కలిపి చిన్నమంటపై ఉంచాలి. ఈలోపు ఒక పాత్రలో మిగిలిన కార్న్‌ఫ్లోర్‌ను పావు కప్పు నీటిలో కరిగించి రొయ్యలపై చల్లాలి. గ్రేవీ చిక్కబడగానే ఉల్లికాడల తరుగు, పంచదార కలిపి దించేయాలి.

Updated Date - 2018-08-25T22:04:40+05:30 IST