చేపల కూర

ABN , First Publish Date - 2018-10-06T18:51:44+05:30 IST

చేపలు- అరకిలో, ధనియాలు - ఒక టీస్పూను, లవంగాలు - మూడు, యాలకులు - రెండు...

చేపల కూర

కావలసినవి
 
చేపలు- అరకిలో, ధనియాలు - ఒక టీస్పూను, లవంగాలు - మూడు, యాలకులు - రెండు, వెల్లుల్లిపాయలు - ఏడు, జీలకర్ర - అర టీస్పూను, పసుపు- పావు టీస్పూను, కారం- రెండు టీస్పూన్లు, అల్లం-చిన్న ముక్క, ఉప్పు- రుచికి సరిపడా, ఉల్లిపాయలు-మూడు (సన్నటిముక్కలుగా తరిగి), పచ్చిమిర్చి- ఐదు, అల్లం-వెల్లుల్లి పేస్టు- అర టీస్పూను, కరివేపాకు-గుప్పెడు. చింతపండురసం-ఒక కప్పు, నూనె-నాలుగుస్పూన్లు.
 
తయారీవిధానం
 
మసాలా దినుసులను నూరాలి. ఒక కడాయి తీసుకుని కడిగిన చేపముక్కలను అందులో వేయాలి. అందులోనే అల్లంవెల్లుల్లి పేస్టు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, ఐదు టేబుల్‌స్పూన్ల నూనె వేసి కలపాలి.
ఒక కప్పు నీళ్లు కూడా అందులో పోసి స్టవ్‌ మీద పది నిమిషాలు ఉడికించాలి.
తర్వాత రెడీగా పెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో పోసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చేపల కూర రెడీ. అందులో అప్పుడే నూరిన మసాలా, కరివేపాకు తరుగు వేసి బాగా కలిపి స్టవ్‌ నుంచి దించాలి. విలేజ్‌ స్టైల్‌ చేపల కూర పసందుగా ఉంటుంది.

Updated Date - 2018-10-06T18:51:44+05:30 IST