మటన్‌ టిక్కా

ABN , First Publish Date - 2017-07-08T17:20:13+05:30 IST

బోన్‌లెస్‌ మటన్‌- అర కిలో, నిమ్మరసం-3 టేబుల్‌ స్పూన్లు, పచ్చి బొప్పాయి గుజ్జు- రెండు టేబుల్‌ స్పూన్లు, టిక్కా మసాలా- 2 టేబుల్‌ స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్టు- టేబుల్‌స్పూను, ఎర్రమిరపకాయల పేస్ట్‌- టేబుల్‌ స్పూను, జీలకర్ర పేస్టు- టేబుల్‌ స్పూను, ఉప్పు- తగినంత, నూనె-తగినంత.

మటన్‌ టిక్కా

కావలసినవి: బోన్‌లెస్‌ మటన్‌- అర కిలో, నిమ్మరసం-3 టేబుల్‌ స్పూన్లు, పచ్చి బొప్పాయి గుజ్జు- రెండు టేబుల్‌ స్పూన్లు, టిక్కా మసాలా- 2 టేబుల్‌ స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్టు- టేబుల్‌స్పూను, ఎర్రమిరపకాయల పేస్ట్‌- టేబుల్‌ స్పూను, జీలకర్ర పేస్టు- టేబుల్‌ స్పూను, ఉప్పు- తగినంత, నూనె-తగినంత.
 
తయారీ విధానం: మటన్‌ను బాగా కడిగి ఆరనివ్వాలి. తర్వాత వాటిని చిన్న ముక్కలుగా చేయాలి. పెద్ద గిన్నె తీసుకుని అందులో నిమ్మరసం, జీలకర్ర పొడి, ఎర్ర మిరపకాయల పేస్ట్‌, పచ్చి బొప్పాయి గుజ్జు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, టిక్కా మసాలా, ఉప్పు వేయాలి. ఈ మిశ్రమంలో మటన్‌ ముక్కలు వేసి బాగా కలిపి అరగంటసేపు ఊరనివ్వాలి. అరగంట తర్వాత మటన్‌ ముక్కలను సన్నటి కడ్డీకి గుచ్చి గ్రిల్‌పై కాల్చాలి. మధ్యమధ్యలో వాటిని అటూ ఇటూ తిప్పుతూ నూనె వేస్తుండాలి. అలా 10-12 నిమిషాల పాటు అంటే మటన్‌ ముక్కలు బాగా ఉడికే దాకా చేయాలి. ఉడికిన మటన్‌ ముక్కలను కడ్డీ నుంచి తీసి వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

Updated Date - 2017-07-08T17:20:13+05:30 IST