Advertisement
Advertisement
Abn logo
Advertisement

చాకొలెట్‌ ఈస్టర్‌ ఎగ్‌

కావలసినవి
 
కుక్కింగ్‌ చాకొలెట్‌- 400గ్రాములు, ఈస్టర్‌ ఎగ్‌ మౌల్డ్స్‌- (గుడ్డు అచ్చులు)షాపుల్లో దొరుకుతాయి.
 
తయారీ విధానం
 
చాకొలెట్‌ను సన్నగా తరిగిపెట్టుకోవాలి. పాన్‌లో సగం దాకా నీళ్లు పోసి వేడిచేయాలి.
హీట్‌ప్రూఫ్‌ బౌల్‌ను అందులో పెట్టి సన్నగా తరిగిపెట్టుకున్న చాకొలెట్‌ను అందులో వేయాలి. సన్నని సెగకు చాకొలెట్‌ తరగు కరగడం మొదలెడుతుంది. దీన్ని మధ్య మధ్యలో కలుపుతుండాలి. చాకొలెట్‌ కరిగిన తర్వాత కిందికి దించేయాలి. దాన్ని 35 డిగ్రీల సెంటిగ్రేడు వరకు చల్లారనివ్వాలి. కుకింగ్‌ థర్మామీటర్‌తో వేడి ఎంత ఉందో గమనించుకోవాలి. ఎగ్‌మౌల్డ్స్‌ (గుడ్డు అచ్చులు)లో ఒక టేబుల్‌స్పూన్‌ చాకొలెట్‌ను పోసి మౌల్డ్‌ను అటు ఇటు కదపాలి. ఇలా చేయడం వల్ల గుడ్డు అచ్చుల అన్ని వైపులా చాకొలెట్‌ పరుచుకుంటుంది. అచ్చుల్లోని చాకొలేట్‌ను చల్లారనివ్వాలి. తర్వాత బట్టర్‌ నైఫ్‌తో అచ్చుల అంచులకు చాకొలెట్‌ లేకుండా చూడాలి. చాకొలెట్‌ ఎగ్‌ మౌల్డ్స్‌ని గ్రీస్‌ పేపర్‌ మీద 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అర సెంటీమీటర్‌ చిక్కదనం వచ్చేవరకూ చాకొలెట్‌ను అచ్చుల్లో పోయాలి. చాకొలెట్‌ పూర్తిగా సెట్‌ అవడానికి ఈ ఎగ్‌మౌల్డ్స్‌ను పదినిమిషాలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత అచ్చులోంచి చాకొలెట్‌ మౌల్డ్‌ను జాగ్రత్తగా తీయాలి.

అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించాలిపల్లెల్లో రియల్‌ మాఫియాపత్తి ధర పైపైకి..!మత్స్యకారులకు కేంద్రం చేయూతప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేయాలిసినిమా పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కుఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలిక్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తాం ‘ఉపాధిహామీ’లో కూలీల సంఖ్యను పెంచాలి పిల్లలు వ్యాధుల బారిన పడకుండా రోటా వ్యాక్సిన్‌
Advertisement