వింటర్‌ ఫ్రూట్‌ కేక్‌

ABN , First Publish Date - 2018-12-08T15:36:05+05:30 IST

తెల్లసొన - ఒకటి, కాస్టర్‌ షుగర్‌ - 50 గ్రాములు, నల్లద్రాక్ష - కొన్ని, తులసి ఆకులు - కొన్ని...

వింటర్‌ ఫ్రూట్‌ కేక్‌

కావలసినవి
 
తెల్లసొన - ఒకటి, కాస్టర్‌ షుగర్‌ - 50 గ్రాములు, నల్లద్రాక్ష - కొన్ని, తులసి ఆకులు - కొన్ని, గుండ్రటి ఫ్రూట్‌ కేక్‌ - ఒకటి(మీకు కావలసిన సైజులో), పండిన తాజా అత్తిపళ్లు - రెండు, కుంక్వాత్‌ పళ్లు - కొన్ని (ఇవి చిన్నవిగా సంత్రాల రంగులో ఉండి గుత్తులుగా కాస్తాయి. పుల్లగా ఉంటాయి), రాస్‌బెర్రీలు - కొన్ని, ఫ్రోస్టింగ్‌కు: తెల్లసొన, ఐసింగ్‌ షుగర్‌ - 175 గ్రాములు.
 
తయారీవిధానం
 
ఒక పాత్రలో తెల్లసొనను పోసి గిలక్కొట్టాలి. బేకింగ్‌ షీటు/ట్రేలో కాస్టర్‌ షుగర్‌ని వేసి దానినిండా పరవాలి. తెల్లసొనలో ద్రాక్ష, తులసి ఆకుల్ని ముంచి వాటిని షుగర్‌లో దొర్లించాలి. ఇలా చేసిన వాటిని అరగంటపాటు ఆరనివ్వాలి. పెద్ద పాన్‌లో నీళ్లు పోసి మరిగే నీళ్లపై పెద్ద బౌల్‌ పెట్టాలి. పాత్ర అడుగు భాగానికి నీరు తగలకుండా ప్లేటులాంటిది నీళ్లల్లో బోర్లించి దానిపై బౌల్‌ను ఉంచాలి. తెల్లసొన, ఐసింగ్‌ షుగర్లను బౌల్‌లో వేసి ఆ మిశ్రమాన్ని నురుగ వచ్చే వరకూ అంటే ఏడు నిమిషాలపాటు బాగా గిలక్కొట్టాలి.
ఈ మిశ్రమాన్ని రెడీగా ఉన్న కేక్‌ పైభాగంలో పోసి నైఫ్‌ సహాయంతో దాన్ని నాలుగువైపులా పరుచుకునేలా చేయాలి. దానిపై అత్తిపళ్లు, కుంఖ్వాత్‌, ఇతర పళ్ల ముక్కలను, ఆకులను చల్లాలి. ఇలా రెడీ అయిన కేక్‌ను ఫ్రిజ్‌లో పెట్టకుండా బయటే ఆరనివ్వాలి. ఈ కేక్‌లో పైన చెప్పిన పళ్ల ముక్కలే కాకుండా మీకు నచ్చిన ఫ్రూట్‌ ముక్కలను వాడొచ్చు.

Updated Date - 2018-12-08T15:36:05+05:30 IST