బెండకాయ కూటు

ABN , First Publish Date - 2015-10-24T16:02:40+05:30 IST

కావలసిన పదార్థాలు: బెండకాయలు: పావుకిలో(ముక్కలుగా చేసుకోవాలి), కందిపప్పు: అరకప్పు, ఉల్లిపాయ: పెద్దది(ముక్కలుగా చేసుకోవాలి), టమోటా: రెండు, (ముక్కలుగా చేసుకోవాలి)

బెండకాయ కూటు

కావలసిన పదార్థాలు: బెండకాయలు: పావుకిలో(ముక్కలుగా చేసుకోవాలి), కందిపప్పు: అరకప్పు, ఉల్లిపాయ: పెద్దది(ముక్కలుగా చేసుకోవాలి), టమోటా: రెండు, (ముక్కలుగా చేసుకోవాలి), పచ్చి మిరపకాయలు: రెండు లేదా మూడు, కొబ్బరి పొడి: అర టీస్పూను, కారం: తగినంత, పసుపు: చిటికెడు, ధనియాల పొడి: టేబుల్‌ స్పూను, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: తగినంత, ఆవాలు, జీలకర్ర: టేబుల్‌ స్పూను, ఎండు మిరపకాయలు: రెండు లేదా మూడు, ఇంగువ: చిటికెడు, కరివేపాకు: కొద్దిగా.
తయారీ విధానం: కుక్కర్‌లో కందిపప్పును మెత్తగా ఉడికించుకోవాలి. బాండీలో నూనె వేసి ఎండు మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అనంతరం బెండకాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత టమోటా ముక్కలు కూడా జతచేయాలి. ఇవన్నీ బాగా ఉడికిన తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి మరికొద్ది సేపు వేగనిచ్చి, ఉడికించిన పప్పును జతచేసి అవసరం అనుకుంటే కొద్దిగా నీరు చేర్చి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి.

Updated Date - 2015-10-24T16:02:40+05:30 IST