మొక్కజొన్న కేక్‌

ABN , First Publish Date - 2016-07-04T15:09:04+05:30 IST

కావలసిన పదార్థాలు: రిఫైన్డ మొక్కజొన్న పిండి(కార్న్‌ఫ్లోర్‌)- 1 కప్పు, పంచదార పొడి- 1/4 కప్పు, ఐసింగ్‌ షుగర్‌- 1/2 కప్పు, వెన్న- 3/4 కప్పు, బేకింగ్‌ పౌడర్‌- 1 టీ స్పూను, గుడ్డు- 1, పాలు- 1/4 కప్పు, వెనిల్లా ఎసెన్స- 4 చుక్కలు

తయారీ విధానం: ఒక గిన్నెలో వెన్న, పంచదార పొడి, ఐసింగ్‌ షుగర్‌, వెనిల్లా ఎసెన్స వేసి గిలకొట్టి, తరువాత గుడ్డు కూడా వేసి నురుగు వచ్చే వరకూ బాగా గిలకొట్టాలి. ఆ తరువాత కార్న్‌ఫ్లోర్‌, బేకింగ్‌ పౌడర్‌లను కలిపి జల్లించి, వాటిని కూడా గుడ్డు మిశ్రమంలో వేసి బాగా కలపాలి. తరువాత పాలు పోసి మరోసారి బాగా గిలకొట్టి ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన/ బటర్‌ పేపర్‌ వేసిన కేక్‌ గిన్నెలోకి తీసుకుని ఓవెనలో గానీ, కేక్‌ కుక్కర్‌లో గానీ ఉడికించుకోవాలి.

Updated Date - 2016-07-04T15:09:04+05:30 IST