లెమన్‌ కేక్‌

ABN , First Publish Date - 2015-12-29T15:23:06+05:30 IST

కావలసిన పదార్థాలు: మైదా పిండి- ఒక కప్పు, నూనె- పావు కప్పు, చక్కెర- నాలుగు టేబుల్‌స్పూన్లు, కోకో పౌడర్‌- మూడు టేబుల్‌స్పూన్లు, వేడినీళ్లు- ముప్పావు కప్పు, వెనిల్లా

లెమన్‌ కేక్‌

కావలసిన పదార్థాలు: మైదా పిండి- ఒక కప్పు, నూనె- పావు కప్పు, చక్కెర- నాలుగు టేబుల్‌స్పూన్లు, కోకో పౌడర్‌- మూడు టేబుల్‌స్పూన్లు, వేడినీళ్లు- ముప్పావు కప్పు, వెనిల్లా ఎసెన్స్‌, బేకింగ్‌ సోడా- పావు టీస్పూను, బేకింగ్‌ పౌడర్‌- అరటీస్పూను, నిమ్మరసం- ఒక టేబుల్‌స్పూను.
తయారీ విధానం: ఒక గిన్నెలో నూనె, చక్కెర, నీళ్లు, వెనిల్లా ఎసెన్స్‌ వేసి బాగా కలపాలి. మరొక గిన్నెలో మైదా, కోకో పౌడర్‌, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా వేసి కలపాలి. నూనె మిశ్రమంలో పిండి మిశ్రమం, నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని బేకింగ్‌ గిన్నెలోకి తీసుకోవాలి. ప్రెజర్‌ కుక్కర్‌ వేడెక్కాక దానిలో నీళ్లు నింపిన గిన్నె పెట్టి దానిపై కేక్‌ గిన్నె పెట్టాలి. విజిల్‌, గ్యాస్‌ కట్‌ పెట్టకుండా మూత పెట్టి సన్నటి మంటపై నలభై నిమిషాలపాటు ఉడికించాలి. కేక్‌ చల్లారాక క్రీము లేకుండా తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది.

Updated Date - 2015-12-29T15:23:06+05:30 IST