బీట్‌ రూట్‌ పచ్చడి

ABN , First Publish Date - 2015-08-29T23:48:35+05:30 IST

కావలసిన పదార్థాలు: మీడియం సైజు బీట్‌రూట్‌ - 1, కొబ్బరికోరు - పావు కప్పు, పచ్చిమిర్చి - 1

బీట్‌ రూట్‌ పచ్చడి

కావలసిన పదార్థాలు: మీడియం సైజు బీట్‌రూట్‌ - 1, కొబ్బరికోరు - పావు కప్పు, పచ్చిమిర్చి - 1, అల్లం తురుము - 1 టేబుల్‌ స్పూను, పెరుగు - ముప్పావు కప్పు, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర తరుగు - అలంకరణకు, నూనె, ఆవాలు, ఇంగువ, కరివేపాకు - తిరగమోతకు సరిపడా.
తయారుచేసే విధానం: బీట్‌రూట్‌ తొక్క తీసి, 4 పెద్ద ముక్కలుగా కట్‌ చేసి కొద్దినీటిలో ఒక విజిల్‌ వచ్చేవరకు కుక్కర్లో ఉడికించాలి. ఈలోపున కొబ్బరి కోరు, పచ్చిమిర్చి, అల్లం మెత్తగా రుబ్బుకుని ఆవాలు, ఇంగువ, కరివేపాకుతో తాలింపు పెట్టి పక్కనుంచాలి. ఉడికిన బీట్‌రూట్‌ ముక్కల్ని సన్నగా తురిమి, పెరుగు, ఉప్పుతో పాటుగా తాలింపు మిశ్రమంలో కలిపి కొత్తిమీరతో అలంకరించాలి. ఈ పచ్చడి బిర్యానీ రైస్‌, పరాటాలతో బాగుంటుంది.

Updated Date - 2015-08-29T23:48:35+05:30 IST