పొటాటో పిజ్జా

ABN , First Publish Date - 2016-01-02T21:21:10+05:30 IST

కావలసిన పదార్థాలు : బంగాళదుంపలు-పావు కిలో, టమాటాలు-100గ్రా, ఉడికించిన మొక్కజొన్న గింజలు-పావు కప్పు, ఉల్లిపాయ-1, కాప్సికమ్‌-1, మష్రూమ్స్‌-3,

పొటాటో పిజ్జా

కావలసిన పదార్థాలు : బంగాళదుంపలు-పావు కిలో, టమాటాలు-100గ్రా, ఉడికించిన మొక్కజొన్న గింజలు-పావు కప్పు, ఉల్లిపాయ-1, కాప్సికమ్‌-1, మష్రూమ్స్‌-3, పన్నీర్‌-100గ్రా, ఆలివ్స్‌-రెండు లేక మూడు, ఉప్పు-రుచికి సరిపడా.
తయారుచేసే విధానం : బంగాళదుంపలను ఉడికించి తోలు తీసి చేతితో చిదిమి ఉంచుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు కలపాలి. గోధుమ పిండిలో టమాటా గుజ్జు, ఉప్పు వేసి కలిపి పూరీలు చేసి ఉంచుకోవాలి. వీటిని నూనెలో కాల్చకూడదు. ఒకో పూరీపైన బంగాళదుంప ముద్దను పరిచి, పైన కాప్సికమ్‌, మొక్కజొన్న , ఉల్లిపాయ, మష్రూమ్‌ ముక్కలతో అలంకరించాలి. పన్నీర్‌ను సన్నని ముక్కలుగా కోసి పైన చల్లి ఓవెన్‌లో ఉంచి 400 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద పావు గంట బేక్‌ చేయాలి. వేడి తగ్గకముందే ఈ పొటాటో పిజ్జాలను పిల్లలకు అందించాలి.

Updated Date - 2016-01-02T21:21:10+05:30 IST