Abn logo

వెజిటెబుల్‌ లాలీపప్‌

కావలసినవి: ఉడికించిన బంగాళదుంపల ముద్ద ఒక కప్పు, తురిమిన చిన్న కేరెట్‌ ఒకటి, బీన్స్‌ 100 గ్రా., కేప్సికమ్‌ ఒకటి, చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఒక్కో టీ స్పూన్‌, కేరెట్‌ స్టిక్స్‌ (కేరెట్‌ను నిలువుగా రెండు లేదా మూడు ముక్కలుగా చీల్చితే స్టిక్స్‌ తయారవుతాయి) 8 లేక 10, మైదా అర కప్పు, సోయా సాస్‌ ఒక టీ స్పూన్‌, చిల్లీ సాస్‌ ఒక టేబుల్‌ స్పూన్‌, బ్రెడ్‌ పొడి అర కప్పు, కోడిగుడ్డు ఒకటి, నూనె వేగించడానికి తగినంత, ఉప్పు, మిరియాల పొడి తగినంత.
ఎలా చేయాలి
కూరగాయలను సన్నగా తరగాలి. ఒక టేబుల్‌ స్పూన్‌ నూనెను బాణలిలో వేసి వేడి చేయాలి. అల్లం, ఉల్లిపాయ ముక్కలను వేసి వేగించాలి. కేరెట్‌ తురుము, బంగాళ దుంపల ముద్ద, తరిగిన బీన్స్‌, కేప్సికమ్‌, పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్‌, చిల్లీ సాస్‌ వేసి బాగా కలపాలి. వీటన్నిటినీ 5 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత కిందికి దించి చల్లారనివ్వాలి. గుడ్డు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని లాలిపాప్స్‌ తీరులో తయారు చేయాలి. ఈ లాలిపాప్స్‌లో కేరెట్‌ స్టిక్స్‌ను జాగ్రత్తగా గుచ్చాలి. వీటిని బ్రెడ్‌ పొడిలో దొర్లించి కాగిన నూనెలో బాగా వేగించాలి. వీటిని సెజువాన్‌ సాస్‌తో గాని, టొమాటో కెచప్‌తో గాని తింటే చాలా బావుంటాయి.


కొనసాగుతున్న లాక్‌డౌన్‌

వలస కూలీలకు ఆశ్రయం

శానిటైజర్ల అందజేత

టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ డీఈగా రమేష్‌

ఆదిలాబాద్‌ జిల్లాలో ఉత్కంఠ

విస్తరిస్తున్న కరోనా సెగ

పల్లెలు భద్రమే!

ఐసోలేషన్‌లో ఏఎస్సై

ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌పై కలెక్టర్‌ ఆగ్రహం

కరోనా వ్యాపించకుండా హైడ్రోక్లోరైడ్‌ స్ర్పే
Advertisement
d_article_rhs_ad_1

నవ్య