బెండకాయ పచ్చడి

ABN , First Publish Date - 2015-08-29T23:52:38+05:30 IST

కావలసిన పదార్థాలు: బెండకాయలు 5, (ఒక మోస్తరు) ఆకుపచ్చ వంకాయ - 1, పచ్చిమిర్చి - 6, పెద్ద ఉల్లిపాయ - 1

బెండకాయ పచ్చడి

కావలసిన పదార్థాలు: బెండకాయలు 5, (ఒక మోస్తరు) ఆకుపచ్చ వంకాయ - 1, పచ్చిమిర్చి - 6, పెద్ద ఉల్లిపాయ - 1, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత. తాలింపు కోసం: ఆవాలు - పావు టీ స్పూను, జీలకర్ర - పావు టీ స్పూను, ఎండుమిర్చి - 1, కరివేపాకు - 4 రెబ్బలు, నూనె - 2 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం: బెండకాయలు, వంకాయ, పచ్చిమిర్చి ముక్కలుగా తరిగి అరకప్పు నీటిలో ఉడికించాలి. చల్లారనిచ్చి మిర్చి విడిగా తీసి పసుపు, చింతపండు గుజ్జు, ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బాలి. అందులోనే ఉల్లి తరుగు వేసి కచ్చాపచ్చాగా నూరి ఆ తర్వాత ఉడికించిన బెండ, వంకాయ ముక్కలు (నీరు లేకుండా) కలిపి నూరాలి. విడిగా తాలింపు పెట్టి రుబ్బిన మిశ్రమంలో కలపాలి. ఈ చట్నీ వేడి అన్నంతో బాగుంటుంది.

Updated Date - 2015-08-29T23:52:38+05:30 IST