పచ్చి మామిడి జెల్లీ

ABN , First Publish Date - 2015-09-01T21:58:28+05:30 IST

కావలసిన పదార్థాలు: పచ్చిమామిడికాయ తురుము - 4 కప్పులు, పంచదార - 4 కప్పులు

పచ్చి మామిడి జెల్లీ

కావలసిన పదార్థాలు: పచ్చిమామిడికాయ తురుము - 4 కప్పులు, పంచదార - 4 కప్పులు, కారం - 1 టీ స్పూను, వేగించిన జీలకర్ర పొడి - 1 టీ స్పూను, యాలకుల పొడి - అర టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - చిటికెడు, (ఇష్టమైతే) నెయ్యి - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: కడాయిలో మామిడి తురుము, పంచదార వేసి చిన్న మంటపై తిప్పుతుండాలి. మిశ్రమం సగానికి సగం అయ్యాక జీలకర్రపొడి, పసుపు, యాలకులపొడి, కారం, ఉప్పు వేసి మరింత చిక్కబడేవరకు కలపాలి. చివర్లో నెయ్యి వేసి దించేయాలి. పరాటా/ బ్రెడ్‌లతో తినడానికి రుచిగా ఉండే జెల్లీ ఇది.

Updated Date - 2015-09-01T21:58:28+05:30 IST