దోసకాయ పచ్చి కొబ్బరి పచ్చడి

ABN , First Publish Date - 2015-09-01T22:19:04+05:30 IST

కావలసిన పదార్థాలు: దోస ముక్కలు - 2 కప్పులు, పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు, పుట్నాలు - పావు కప్పు

దోసకాయ పచ్చి కొబ్బరి పచ్చడి

కావలసిన పదార్థాలు: దోస ముక్కలు - 2 కప్పులు, పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు, పుట్నాలు - పావు కప్పు, ఎండుమిర్చి - 3, జీలకర్ర - 1 టీ స్పూను, ఇంగువ - చిటికెడు, చింతపండు గుజ్జు - 2 టీ స్పూన్లు, నువ్వుల నూనె - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, ఆవాలు + మినప్పప్పు + శనగపప్పు, కరివేపాకు - తాలింపు కోసం.
తయారుచేసే విధానం: నూనెలో ఎండుమిర్చి, ఇంగువ, జీలకర్ర వేగించి తీసేయాలి. మిగిలిన నూనెలో పచ్చికొబ్బరి, దోసముక్కలు వేసి కొద్దిసేపు వేగించాలి. గ్రైండర్‌లో ఎండుమిర్చి, ఇంగువ, జీలకర్ర, పుట్నాలు పొడిచేసి అందులోనే కొబ్బరి, దోసముక్కలు, ఉప్పు కలిపి రుబ్బుకోవాలి. తర్వాత తాలింపు పెట్టి రుబ్బిన దోస మిశ్రమాన్ని కలుపుకోవాలి. వేడి వేడి అన్నంతో ఈ దోస కొబ్బరి చట్నీ ఎంతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-01T22:19:04+05:30 IST